బాలయ్యతో చేయడం లేదు: త్రిష

posted on: Jun 21, 2013 7:57PM

Balakrishna Latest News, Balakrishna Boyapati Srinu movie, Balakrishna Boyapati Srinu

 

 

నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటిల 'సింహ' సూపర్ హిట్ తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్లో మరో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు హీరోయిన్లను ఎంపిక చేయకపోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. లేటెస్ట్ గా త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషను తీసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో...త్రిష ట్విట్టర్ లో ఈ వార్తలపై స్పందించింది.


ప్రస్తుతం తాను తెలుగులో కానీ తమిళ్ లో ఏ సినిమాకు సైన్ చేయలేదని, గతంలో ఒకే చేసిన ప్రాజెక్ట్ లతోనే బిజీగా ఉన్నానని వివరణ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతునే ఉంది. ఈ సినిమా దుబాయ్‌లో షెడ్యూల్ తో మొదలుకానుందని సమాచారం. అక్కడ ఎడారిలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...