Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీరసలు జర్నలిస్టులేనా? కొమ్మినేని, కృష్ణం రాజులపై బాలకోటయ్య ఫైర్.. రాష్ట్రబహిష్కరణకు డిమాండ్
posted on: Jun 7, 2025 3:31PM
.webp)
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్నారంటూ' జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వివిఆర్ కృష్ణంరాజు అమరావతి ప్రాంత మహిళలను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. అలాగే అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య యాంకర్ కొమ్మినేని, అనలిస్ట్ కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్ కే బాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జీ.రఘురాం, నాగ మల్లేశ్వర రావులు ఒక సంయుక్తలో ఖండించారు. ఒక పత్రికకు ఎడిటర్ గా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పాత్రికేయ సమాజానికి తలవొంపులు తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని మహిళలపై విషం కక్కిన కృష్ణం రాజు తక్షణమే అమరావతి ప్రాంత మహిళలకు, రాష్ట్ర ప్రజలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య అయితే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పిచ్చి కుక్కల్ని, ఊర పందుల్ని, కాటేసే పాముల్ని వన్య ప్రాణుల సంరక్షణ పేరిట అలా వదిలేస్తే ప్రమాదకరమని, పిచ్చి కుక్కల్ని తాళ్ళతో కట్టెయాలని, ఊరపందుల్ని ఊళ్ళ నుంచి తరిమేయాలని, బుసలు కొట్టే పాములను కోరలు పీకి బుట్టల్లో బంధించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం (జూన్ 8) విడుదల చేసిన ప్రకటనలో యాంకర్ గా కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణంరాజు ప్రజా రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొనడం క్షమించరాని నేరమన్నారు. ఆ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధానిపై ఇప్పటివరకు వైకాపా నాయకులు చేసిన అశుద్దపు ప్రచారాలకు ఇది పరాకాష్ట అన్న బాలకోటయ్య.. పురాణాల్లో దేవతల రాజధాని అమరావతి అని, ఆంధ్రప్రదేశ్ లో రైతుల భాగస్వామ్యం కలిగిన ప్రజా రాజధాని కూడా అలాంటిదేనన్నారు. అటువంటి ప్రజారాజధానిపై ఇష్టారీతిగా దూషణలు చేయటం పాత్రికేయ వృత్తికే కళంకం అని పేర్కొన్నారు. రాజధాని పొడ గిట్టని ఇలాంటి వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి 24 గుంటల్లోగా కొమ్మినేని, కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలను కించపరుస్తూ, రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ కొమ్మినేని, కృష్ణంరాజుల వ్యాఖ్యలపై తాను స్వయంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.



.webp)


