నటుడు బాల ప్రశాంత్ దుర్మరణం

posted on: Nov 14, 2015 4:23AM

 

‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు’ అనే సినిమాలో నటిస్తున్న బాల ప్రశాంత్ అనే నటుడు శుక్రవారం నాడు హైదరాబాద్‌లో దుర్మరణం చెందాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వున్న ఒక అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి జారి కింద పడటంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. బాల ప్రశాంత్ సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూ వుంటాడని, ఒక సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. బాల ప్రశాంత్ నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై ఆగిపోయింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...