Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాల్ ఠాక్రే పరిస్థితి విషమం
posted on: Nov 11, 2012 10:44AM

శివసేన అధినేత బాల్ ఠాక్రే పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. బాల్ ఠాక్రే ఊపిరితిత్తులు, క్లోమగ్రంథి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బాంద్రాలోని ఠాక్రే ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ సమయంలో ఆమెతో పాటు శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఉన్నారు. బాల్ ఠాక్రే ఆరోగ్యం బాగు పడాలంటూ ఆయన మేనల్లుడు రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన కార్యకర్తలు పలు దేవాలయాల్లో పూజలు చేశారు.
దసరా వేడుకల్లో బాల్ ఠాక్రే పాల్గొనకపోవడంతో అప్పటి నుంచే ఆయన ఆరోగ్యంపై సందేహాలు తలెత్తడం ప్రారంభించాయి. ఆయన ఉద్ధవ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలంటూ పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు తెలిసింది. ఆయన అనారోగ్య కారణాలతో జూలైలో ఆసుపత్రిలో చేరారు.






