Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో ఆగని దారుణాలు..బాబు లేఖాస్త్రాలు
posted on: May 2, 2022 2:37PM
ధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదు పేజీల లేఖ రాశారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన దారుణ ఘటనతో పాటు.. గత నాలుగు రోజులుగా ఏపీలో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్ఐమ్ రేట్ పై వివరాలు, మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను తన లేఖకు చంద్రబాబు జతచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు. పేట్రేగిపోతున్న వైసీపీ గూండాలను అదుపు చేయలేక పోలీసుశాఖ చతికిలపడుతోందని ఆరోపించారు. జంగిల్ రాజ్ ఏలుబడిలో రాష్ట్ర ప్రజలకు భద్రతే లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం అయ్యిందని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. జంగిల్ రాజ్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పెట్రేగుతున్న వైసీపీ గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతోందని ఆరోపించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రారావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిన విషయాన్ని తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో ఆ దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా.. పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
అనంతపురంలో పింఛన్ అడిగిన పాపానికి పోలీసు ఎస్సై టీడీపీ కార్యకర్తపై దాడి చెయ్యడం పోలీసు శాఖలో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకపోయినా.. కర్ణాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అరెస్టు చేశారని గుర్తుచేశారు. తాజాగా ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డగ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్న విషయం డీజీపీకి చంద్రబాబు రాసిన తన లేఖలో ప్రస్తావించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని తన లేఖలో చంద్రబాబు కోరారు.



.webp)


