దర్శిలో వెలసిన దిగంబర బాబా

Publish Date:Nov 29, 2012

 

Baba poojalu, baba cloths, baba richuals, baba nacked, baba top less, baba bottom less, darsi baba poojalu

 

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఓ గుట్టమీద దిగంబర బాబా వెలిశాడు. ఒంటిమీద నూలుపోగైనా లేకుండా యజ్ఞాలూ, యాగాలు చేయడం ఈయన ప్రత్యేకత. ఈ పూజలకు ఎవరైనా హాజరు కావొచ్చు. ఎంతసేపైనా చూసిపోవచ్చు.

 

బాబాకి చాలా మహిమలున్నాయని, ఆయన్ని చూస్తే చాలు సమస్యలన్నీ తీరిపోతాయనీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరగడంతో చిన్నా పెద్దా తేడాలేకుండా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పూర్తిగా దిగంబరంగా ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి మహిళలుకూడా అశేషంగా తరలిరావడం మరో విశేషం.

 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేవుగానీ.. మహిళా సంఘాలు మాత్రం బాబా తీరుపై విరుచుకు పడుతున్నాయి. ఆడవాళ్లు తిరిగే చోట బట్టలూడదీసుకుని కూర్చోవడమేంటంటూ నిలదీశాయి. మాట వినకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కాస్త సాఫ్ట్ గానే ఉపదేశం చేశాకగానీ బాబా బట్టలు కట్టుకోలేదు.