కబేళాలపై అజంఖాన్.. ముస్లింలు తినడం మానాలి...

posted on: Mar 28, 2017 11:40AM

 

ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. అయితే గత కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన మరోసారి తెరపైకి వచ్చారు. ఈసారి బీఫ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కబేళాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అజంఖాన్.. ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కబేళాలను ఎందుకు మూసేస్తున్నారని..దేశ వ్యాప్తంగా వీటిపై నిషేధం విధించాలని... దేశమంతా ఒకటే చట్టం ఉండాలని అన్నారు. లైసెన్స్ ఉన్న, లైసెన్స్ లేని కబేళాలు అనే తేడా అనవసరమని... అన్నింటినీ మూసివేయించాలని డిమాండ్ చేశారు. ఏ జంతువునూ చంపవద్దని.. కొన్ని మతాల వారు కోడి, మేక కూడా తినరని... అదేవిధంగా ముస్లింలు కూడా గొడ్డు మాంసాన్ని తినడం మానేయాలని సూచించారు. మరి అజంఖాన్ వ్యాఖ్యలపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...