Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అయోధ్య పూజారి శాపం.. బీజేపీకి ఓటమి తప్పదా పాపం...
posted on: Jun 6, 2018 4:56PM

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టుంది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి.. మొన్నటివరకు మాకు తిరుగులేదనుకున్నారు.. ఆ అహంకారంతోనే మిత్రపక్షాల్ని దూరం చేసుకున్నారు.. రోజురోజుకి ప్రజల్లో విశ్వాసం కూడా కోల్పోతున్నారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా.. జరగాల్సిన నష్టం జరిగాక లేటుగా తమ తప్పుని తెల్సుకున్నారు బీజేపీ నేతలు.. మళ్ళీ మిత్రపక్షాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఏం లాభం ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది..ఇది చాలదన్నట్టు కొత్తగా మరో చిక్కొచ్చి పడింది.. అదేంటంటే, అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి బీజేపీకి శాపనార్థాలు పెట్టారు.. శ్రీరాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ, తరువాత ఆయన్ని మర్చిపోయిందన్నారు.. దానివల్లే ఇప్పుడు బీజేపీకి ఓటములు ఎదురవుతున్నాయన్నారు.. వీలైనంత త్వరగా రామ మందిరాన్ని ప్రారంభిచాలని.. లేకుంటే 2019 లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.. ఇప్పటికే కొందరు అర్చకులు రామమందిరం వెంటనే ప్రారంభించకపోతే ఉద్యమిస్తాం అంటున్నారు.. అన్నట్టుగానే రామమందిరం కోసం ఉద్యమం మొదలైతే బీజేపీకి మరింత కష్టకాలమే.. పాపం బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అయ్యో రామా అన్నట్టుగా ఉంది...






