Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీకు ఉదయాన్నే ఈ అలవాట్లు ఉన్నాయా? వెంటనే మానేయడం మంచిది..
posted on: Feb 13, 2025 9:30AM
.webp)
శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి, సరైన ఆహారం, సరైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. రోజంతా ఏమి చేస్తారు, ఏమి తింటారు, రోజును ఎలా గడుపుతారు అనేవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా రోజును ఎలా ప్రారంభిస్తారనేది ఆరోగ్యానికి డైరెక్ట్ గా లింక్ కలిగి ఉంటుంది.అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ ఉదయాన్నే ప్రజలు ఫాలో అయ్యే కొన్ని చెడ్డ అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ అలవాట్లు వెంటనే మానేయడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయని కూడా పేర్కొన్నారు. ఇంతకీ ఉదయాన్నే మానుకోవాల్సిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.
అల్పాహారం తరువాత..
ఉదయం నిద్రలేచి, అల్పాహారం తీసుకుని, మళ్ళీ నిద్రపోయేవారు ఉంటారు. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాటు ఉన్నవారు అనేక కడుపు సంబంధిత సమస్యలతో బాధపడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా ఉదయం నిద్రలేవగానే మొబైల్ లేదా టీవీ చూడటం చాలామందికి అలవాటైపోయింది. ఈ అలవాటు చిన్నదిగా అనిపిస్తుంది. కానీ ఇది వయస్సుకు ముందే వ్యక్తులను వృద్ధులను చేస్తోంది. మొబైల్ ఫోన్‌ను అధికంగా వాడటం వల్ల కళ్ళు, మెదడుపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇది నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.
కాఫీ, టీ..
చాలా మంది టీ లేదా కాఫీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది గుండె, రక్తపోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం జీర్ణ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ అలవాటు వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
వైద్యులేమంటారంటే..
ఆరోగ్యంగా ఉండటానికి దినచర్యను మెరుగుపరచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ప్రమాదకరం. దానికి బదులుగా వార్తాపత్రికలు లేదా పుస్తకాలు చదవాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు శక్తినిస్తుంది. దీని వల్ల రోజు ఆరోగ్యంగా ప్రారంభమవుతుంది. చాలా మంది ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ముఖం, చేతులు కడుక్కున్న తర్వాత పనికి వెళతారు. ఈ అలవాటును క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అనేక అంటు వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. దినచర్య, రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఆరోగ్యంగా ఉండటం సులభం అవుతుంది.
*రూపశ్రీ.






