అవిక లవ్ లో పడిపోయిందట
posted on Feb 21, 2014 10:34AM

అవికా గోర్, శౌర్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం "లక్ష్మీ రావే మా ఇంటికి". నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ పాత్రికేయులు గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ గురువారం హైదరాబాదులో చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ...మంచి కథతో సినిమా నిర్మించాలని నా ఆశ. ఈ సినిమాతో నా కోరిక నెరవేరుతుంది. నంద్యాల రవి చక్కని కథ తయారు చేశారు. అవికా కోసం ఆరు నెలలు ఎదురు చూశాం. ఆమెతో సినిమాకు గ్లామర్ వచ్చింది. "ఇడియట్" సినిమాతో రవితేజకు ఎంత మంచి పేరొచ్చిందో.. ఈ చిత్రం ద్వారా శౌర్యకి కూడా మంచి పేరు వస్తుంది" అని అన్నారు. అవికా మాట్లాడుతూ... కథ వినగానే.. నా పాత్రతో నేను లవ్ లో పడిపోయాను. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది" అని ఆశాభావం వ్యక్తం చేసారు.