భర్త తప్పు.. పరువు కోసం.. మొత్తం ఫ్యామిలి ప్రాణం తీశాడు.. 

posted on: Jun 4, 2021 2:27PM

అతని పేరు బిక్షపతి. పెళ్లి అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. బిక్షపతి బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. ఆటో వాళ్ళు అంటే ఇక చెప్పనక్కర్లేదు. దాదాపు అని అలవాట్లు ఉంటాయి. ఇక రాత్రి అయిందంటే కిక్కు కోసం సుక్క పక్క కావాలే, మందు పడితేగాని ముద్దా దిగాడు కొందరికి. ఈ బిక్షపతి చేసిన నిర్వాహకానికి కుటుంబం మొత్తం చెనిపోయారు. ఇంతకీ ఎంజారిందో తెలుసుకుందాం..? 

వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌కు చెందిన భిక్షపతి, ఉష దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కీసర పరిధిలోని నాగారం-వెస్ట్‌ గాంధీనగర్‌ వచ్చారు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె హర్షిణి, కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. రోజు ఆటో నడిపే బిక్షపతి ఎందుకు తనలో ఉన్న నీచ బుడ్డి బయటికి తీశాడు. అతని వంకర బుద్దితో పక్కనే ఓ ఇంట్లో ఉన్న ఓ బాలిక పట్ల భిక్షపతి అసభ్యకరంగా వ్యవహరించేవాడు. ఆ బాలిక ఓపిక నశించిందో లేక ఎవరైనా బిక్షపతి అలా వ్యవహరిస్తుంటే చూశారో తెలియదు. ఈక్రమంలో గురువారం రాత్రి బిక్షపతిపై దాడి చేశారు. అనంతరం శుక్రవారం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి వెళ్లిపోయారు.   

కట్ చేస్తే.. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. అందరి ముందు పరువుపోయిందనుకున్నాడు. ఆ అవమానం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఇంటికి వచ్చాడు. తొలుత తన భార్య, పిల్లలకు ఉరి వేశాడు. అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...