Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రగతి భవన్ ఎదుట ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
posted on: Sep 18, 2020 2:01PM
హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ ఎదుట ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలంటూ శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు ఆఫీస్ ఎదుట ఆటో డ్రైవర్ చందర్ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గుర్తించిన పోలీసులు చందర్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక 2010లోనూ అసెంబ్లీ ఎదుట చందర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అప్పుడు కూడా పోలీసులు అడ్డుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ చందర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.






