Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోడలి మరణవార్త విని అత్త మృతి
posted on: May 31, 2015 8:08PM

కోడలి మరణవార్త విని అత్త గుండెపోటుతో మరణించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం రాజానగరం గ్రామంలో జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెంగమ్మ (40) అనే మహిళ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నానికి రాజానగరం గ్రామానికి తరలించారు. కోడలి మృతదేహాన్ని చూసిన వెంటనే ఆమె అత్త గిరమ్మ (70) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించింది. అత్తాకోడళ్ళు ఒకేసారి మరణించడంతో ఆ ఇంట్లో విషాదం కమ్ముకుంది. ఈరోజుల్లో కూడా ఇంత అన్యోన్యంగా వుండే అత్తాకోడళ్ళు వుండటం విశేషమేనని పలువురు అనుకుంటున్నారు.


.jpg)


