ఏపీకి ప్రత్యేక హోదా రాదా?

 

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? ఇప్పుడు అందరికి వచ్చే ప్రశ్న ఈ ఒక్కటే. ఇప్పుటికే ఒకవైపు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాగైనా ప్రత్యేక హోదా తేవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా ఒక్కటే కాదు ఏపీకి కావలసిన అవసరాలు, ఇబ్బందుల గురించి కూడా చర్చించనున్నారు. అంతేకాదు మోడీ  బీహార్ కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలా కాకుండా ఉత్తర ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్టుల తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన 200 పేజీల ముసాయిదాను కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

అయితే అందరూ మోడీ చంద్రబాబు ల భేటీ కోస..ఆ భేటీలో ప్రత్యోక హోదా విషయంపై ఏం నిర్ణయం తీసుకుంటారా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రత్యేక హోదా రాదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు,కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశమని.. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని మాత్రమే కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దీంతో ప్రత్యేక హోదా రాదనే విషయం అశోక గజపతి రాజు మాటాల్లోనే అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu