TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ తరువాత స్థానాన్ని ఆక్రమించిన కేజ్రీవాల్

Published on: Thu Nov 19, 2015 1:41PM


ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ట్విట్టర్ ఫాలోవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరికి కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు మోడీ. ఇప్పుడు ప్రధాని తరువాత ఆస్థానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఆక్రమించారు. మంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ ఘనత సాధించిన రెండో రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ అవతరించారు. రాత్రికి ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 లక్షలకు చేరిందని ట్విట్టర్ లో 60 లక్షల మార్క్ ను కేజ్రీవాల్ దాటారని 'ఆప్' సోషల్ మీడియా చీఫ్ అంకిత్ లాల్ తెలిపారు. కాగా మోడీకి మొత్తం 1.6 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఒకరు