TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులిస్తాం.. జైట్లీ

Published on: Sat May 23, 2015 3:15PM

ఏడాది మోదీ పాలనపై ఏర్పాటుచేసిన రెండో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ... కొన్ని సాంకేతిక కారణాల వల్లే ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, కానీ ఏపీకీ ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని అన్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల ఏపీ కోల్పోయిన నిధులన్నింటిని సమకూరుస్తామని, ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అవినీతి పాలన పోయి పారదర్శక పాలన వచ్చిందని అరుణ్ జైట్లీ అన్నారు.