ఢిల్లీలో ఒక రోజు హోటల్‌ అద్దె రూ.32 లక్షలు!

posted on: Feb 9, 2026 8:08PM

 

ఢిల్లీ వేదికగా ఈ నెల 19, 20 తేదీల్లో ఆర్టిఫిషియల్ ఇంపార్ట్ సమ్మిట్ జరగనుండటంతో దేశరాజధానిలోని హోటళ్లలో సూపర్ లగ్జరీ రూమ్‌ల టారిఫ్‌లకు రెక్కలొచ్చాయి. దానికి టెక్ దిగ్గజాలు గూగుల్ సీఈఓ సందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వంటి టెక్ లీడర్లు హాజరవుతుండటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ క్రయంలో  సాధారణ రోజుల్లో రూ. 2 లక్షలు ఉండే ఢిల్లీ హోటళ్లలోని లగ్జరీ రూమ్‌ల టారిఫ్‌లు రూ. 32లకు చేరాయి.  

ఒక్క రోజుకు తాజ్ ప్యాలెస్‌లోని గార్డెన్ లగ్జరీ సూట్ ధర అన్ని ట్యాక్సులతో కలిపి రూ.32కు చేరిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హయత్ యాజమాన్యంలోని అందాజ్ ఢిల్లీ హోటల్‌లోని సిగ్నేచర్ సూట్ రూ.3.86 లక్షలకు చేరిందంట. ఈఐ హైప్రొఫైల్ ఈవెంట్ కారణంగా రూమ్‌ల ధరలు విపరీతంగా పెరిగి, ముందస్తు బుకింగులు జరుగున్నాయి. 

తమ హోటల్‌లో సమ్మిట్ జరిగే తేదీల్లో అన్ని గుదులు దాదాపు బుక్ అయ్యాయని లలిత్ సూరి హాస్పిటాలిటీ గ్రూప్ హోటల్స్ మేనేజ్‌మెంట్ ప్రకటించడం గమనార్హం. ఈ సమ్మిల్ కోసం సూమారు 100 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు హాజరుకానుండటమే ఈ డిమాండ్‌కు కారణమైంది. ఇప్పటివరకు నాలుగుసార్లు పలు దేశాల్లో ఈ సదస్సు జరిగింది. వాటన్నింటికంటే ఢిల్లీలో జరిగే ఈవెంటే పెద్దదంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...