అమెరికా, చైనాలకు ఏపీ నుంచి ఆక్వా ఎగుమతులు 

posted on: Mar 31, 2020 6:15PM

*సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకున్న ఏపీ ఆక్వా రంగం 

*69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పని ప్రారంభమైందన్న అధికారులు. 

విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్‌ నుంచి 4 కంటైనర్లతో, అమెరికా, చైనాలకు ఆక్వా ఉత్పత్తులు ప్రారంభమైనట్టు అధికారులు చెప్పారు. ప్రాససింగ్‌ కేంద్రాల్లో వర్కర్స్‌ పాసుల జారీ చేసేందుకు జిల్లాల్లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌లతో మాట్లాడుతున్నామని  ఫిషరీస్‌ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. వారినుంచి వచ్చే సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారంకోసం పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్కడా నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుమిగూడకుండా చూడాలని సీఎం ఆదేశం. కోవిడ్‌ –19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ.. ఆమేరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చూడాలన్న సీఎం. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6గంటల నుంచి 11 గంటలవరకూ, మిగిలిన ప్రాంతాల్లో 6 గంటలనుంచి 1 గంటవరకూ సమయం పాటించాలని ముఖ్యమంత్రో సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...