రేట్లు పెంచకుండా ప్రత్యేక బస్సులు!

posted on: Oct 1, 2024 1:10PM

దసరా సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.  ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా    ఈ నెల 4 నుండి 20 వరకు మొత్తం 6,100 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  ప్రయాణికులపై భారం మోపకుండా   సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశ పెట్టిన  యూటీఎస్ మెషీన్లతో చిల్లర సమస్య కూడా తలెత్తదు. ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ ,  క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. ముందస్తుగా సీటు వివరాలు చెక్ చేసుకుని బస్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉందని ఆర్టీసీ పేర్కొంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...