ఆపిల్ వాటర్ ఫ్రూఫ్ ఫోన్లు

ప్రముఖ మొబైల్ సంస్థ ఆపిల్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇతర మొబైల్ కంపెనీలకు పోటీగా వాటర్ ఫ్రూఫ్ మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చే పనిలో ఉంది. సోనీ నుండి వస్తున్న వాటర్ ఫ్రూఫ్ మోడళ్లకి ధీటుగా సవాల్ విసురుతోంది. ఇందుకోసం ఆపిల్ ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోఫోబిక్ కోటింగ్ ను వినియోగిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే పేటెంట్ రైట్స్ కోసం యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ లో దరఖాస్తు చేసింది. మొబైల్ లోని ప్రధాన విడిభాగాలన్నింటిపైనా ఈ రసాయనం పూత పూస్తారు. అలాగే విడిభాగాలు కలిపే చోట షార్ట్ సర్క్యూట్ కాకుండా సిలికాన్ సీల్ ను వినియోగిస్తారు. దీనివల్ల నీళ్లు లోపలికి పోయినా ఫోన్ కు ఏ సమస్యా రాదు. ఇతర మోడళ్లతో పోలిస్తే ఇవి కొంచెం మందంగా ఉంటాయి.