యాపిల్ "స్మార్ట్ వాచ్"

Publish Date:Mar 11, 2015

 

టెక్నాలజీలో తన ప్రత్యేకతను చాటుకున్న ఆపిల్ సంస్థ ఇప్పుడు స్మార్ట్ వాచీలను మార్కెట్ లోకి తీసుకొచ్చే పనిలో పడింది. ఈ స్మార్ట్ వాచీలు జూన్-జులై నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపారు. యాపిల్ సంస్థ స్టీల్, అల్యూమినియం, పసిడి వేరియంట్స్‌తో మూడు వాచీలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటి ధరలు 349 డాలర్లు (సుమారు రూ. 21,800) నుంచి 17,000 డాలర్లు (దాదాపు రూ. 10.66 లక్షలు) దాకా ఉంటాయని కంపెనీ తెలిపింది. భారత్ లో దీని ప్రాథమిక మోడల్ ధర రూ. 30,000 పైచిలుకు ఉంటుందని అంచనా.

By
en-us Political News