యాపిల్ నుంచి కారు రాబోతోంది...

Publish Date:Feb 17, 2015

 

ఇప్పటి వరకూ ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజంలా వున్న యాపిల్ సంస్థ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోకి కూడా ఎంటరవబోతోంది. అది కూడా ఒక ఎలక్ట్రిక్ కారుతో ఈ రంగంలోకి ప్రవేశించాలని యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారు రూపకల్పన కూడా ఆల్రెడీ జరిగిపోతోందట. ఈ రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో వున్న జనరల్ మోటార్స్, నిస్సాన్, టెస్లా కార్లకు ధీటుగా ఎలక్ట్రిక్ కారును యాపిల్ సంస్థ రూపొందిస్తోందట. అమెరికాలో ఒక రహస్య ప్రదేశంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఈ కారు రూపొందుతోందట. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. యాపిల్ సంస్థ రూపొందించే కారు ఒక మినీ వ్యాన్ మోడల్లో వుంటుందట. ఈ కారు మార్కెట్లోకి రావడానికి ఇంకా కొద్ది సంవత్సరాలు పట్టే అవకాశం వుందట. అయితే ఈ విషయంలో యాపిల్ వర్గాలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈమధ్యకాలంలో యాపిల్ సంస్థ వందలాది మంది కార్ల తయారీ నిపుణులను రిక్రూట్ చేసుకుంది.

By
en-us Political News