ముంబై సిద్ధి వినాయకుని సేవలో యాపిల్ చీఫ్
Published on: Wed May 18, 2016 3:53PM

ఐటీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటనలో భాగంగా ముంబైలో సందడి చేశారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ది వినాయక స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీతో కాసేపు ముట్టడించారు. దర్శనం సమయంలో కుక్ వెంట యాపిల్ ఇండియా హెడ్ సంజయ్ కౌశల్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ అమ్మకాలు పడిపోతున్న నేపథ్యంలో అమ్మకాలను పెంచుకోవడానికి ఆయన భారత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కుక్ రేపు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో యాపిల్ డిజిటల్ మ్యాపింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు.


