'ఆప్' నుంచి గెంటేశారు...

 

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాకముందు అంతా బానే ఉన్నా, అధికారంలోకి వచ్చిన తరువాతే అసలు సమస్య మొదలైంది. ఆ పార్టీలో వాళ్లలో వాళ్లకే విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లు పాల్గొనలేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం అనంతరం ఆ ఇద్దరిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రశాంత్, యోగేంద్ర మద్ధతు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.