తెలంగాణకు ఏపీ పవర్ కట్...
Published on: Tue Jun 6, 2017 1:04PM

ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయాలని నిర్ణయించుకుంది. ఈరోజు నుంచి కరెంటును బంద్ చేస్తున్నామని, ఈ బకాయి మొత్తం వెంటనే చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తూ తెలంగాణ ట్రాన్స్ కో అధికారులకు లేఖ రాసింది. ఇప్పటివరకు తాము సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి రూ. 4, 449 కోట్ల బకాయి ఉందని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు తెలిపింది. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. మరి ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


