మూడు రాజ‌ధానులపై దిగొచ్చిన జ‌గ‌న్‌.. బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌! అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధాని

posted on: Nov 22, 2021 10:39AM

జ‌గ‌న్‌రెడ్డి దిగొచ్చారు. ప్ర‌జా ఉద్య‌మానికి ప్ర‌భుత్వం త‌ల‌వంచింది. తీవ్ర‌ వివాదాస్ప‌ద‌మైన మూడు రాజ‌ధానుల బిల్లును స‌ర్కారు ఉప‌సంహ‌రించుకుంది. ఆ మేర‌కు ఏపీ హైకోర్టులో అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ముందు వెల్ల‌డించారు. 

మ‌రోవైపు, ఏపీ కేబినెట్ స‌మావేశంలోనూ మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకోవాల‌ని మంత్రి మండ‌లి ఆమోదించ‌నుంది. 

ఇక‌, ఏపీ అసెంబ్లీలోనూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి  మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌నున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...