ఏపీ ప్రజల మొగ్గు తెలుగుదేశం వైపే.. రఘురామ

posted on: Aug 23, 2022 11:11AM

ఆంధ్రప్రదేశ్ ప్రజల మొగ్గు తెలుగుదేశం వైపేనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల మొగ్గు ఎటువైపు అన్న విషయంపై తాను సొంతంగా సర్వే చేయించినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఆ సర్వేలో జనం మొగ్గు తెలుగుదేశం వైపే ఉందని స్పష్టమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 90 పైగా స్థానాలలో విజయం సాధిస్తుందని ఆ సర్వే తేల్చిందన్నారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేలు చూసి అంతా మాకే అనుకూలంగా ఉందని వైసీపీ భావిస్తే గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

తాను ఓ యాప్ ద్వారా సర్వే చేయించాననీ, ఆ సర్వేలో ఏపీ ప్రజలు తెలుగుదేశం పట్ల సానుకూలంగా ఉన్నారని తేలిందని రఘురామ కృష్ణం రాజు అన్నారు. అలాగే ఇటీవలి కాలంలో జనసేనకు కూడా ఆదరణ బాగా పెరిగిందన్నారు.

ఎటొచ్చీ వైసీపీ పరిస్థితే నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారైందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గమూ కూడా వైసీపీ పట్ల సానుకూలంగదా లేదని ఆయన పేర్కొన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...