విభ‌జ‌న జరుగుతుంద‌ని ఎలా న‌మ్ముతున్నారు

 

స‌మ్మెలో ఉన్న ఏపిఎన్జీవోల‌పై నో వ‌ర్క్ నో పే అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వంపై జెఏసి నాయ‌కులు కోర్టును ఆశ్రయించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పరిస్థితుల‌పై కోర్టు కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని ప‌రిస్థితులు ప్రభుత్వం నియంత్రించ‌లేని ప‌క్షంలో కోర్టు స్వయంగా జోక్యం చేసుకుంటుంది అని వ్యాఖ్యానించింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 16కు వాయిదా వేసింది హై కోర్టు.జీఓ 177 ప్రకారం ప్రభుత్వం ఎన్జీవోల‌పై నో వ‌ర్క్ నో పే అమ‌లు చేస్తున్నామ‌ని కోర్టుకు వివ‌రించింది.

అయితే ఈ స‌మ‌స్యలో ఉద్యోగ సంఘాల‌ను ఉద్దేశించి కూడా కోర్టు కొన్నికీల‌క వ్యాఖ్యలు చేసింది, రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని కేంద్ర ప్రభుత్వం అధికారిక నోట్ ఇవ్వలేద‌ని అప్పుడే విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని ఎలా భావిస్తున్నారు అని ప్రశ్నించింది. అలాగే విభ‌జ‌న త‌రువాత ఉద్యోగుల‌కు ఇబ్బందులు క‌లుగుతాయ‌ని ఎలా అనుకుంటున్నార‌ని ప్రశ్నించింది. ఇలా ఊహాజనిత విష‌యాల‌తో స‌మ్మే చేయ‌టం త‌గ‌ద‌న్న కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 16 కు వాయిదా వేసింది.