సెప్టెంబర్ 2న కేంద్ర మంత్రులు రాజీనామాలు

 

సీమంధ్రకు చెందిన కేంద్రమంత్రులను వెంటనే పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో చేరకపోయినట్లయితే వచ్చే ఎన్నికలలో వారందరికీ తగిన గుణపాఠం చెపుతామని నిన్నఏపీ.ఎన్జీఓలు గట్టిగా హెచ్చరించిన తరువాత, సదరు నేతలలో కంగారు మొదలయింది. ఈరోజు వారందరూ పార్లమెంటు సెంట్రల్ హాలులో సమావేశమయ్యి తమ రాజీనామాల విషయమై చర్చించారు. మళ్ళీ సెప్టెంబర్ 2న మరో మారు సమావేశమయ్యి తమ రాజీనామాలపై ప్రకటన చేయాలని నిర్ణయించుకొన్నారు. ఒకవేళ వారందరూ తమ పదవులకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించి, దానిని ఆమోదింపజేసుకొనగలిగితే కేంద్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఆవిధంగా జరగాలని కేంద్రం కోరుకోదు గనుక వారి రాజీనామాలను వెంటనే ఆమోదించకుండా పక్కన బెట్టి కాంగ్రెస్ అధిష్టానం వారిని శాంతింపజేసే ప్రయత్నాలు చేయవచ్చును.