Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమ్మెల్సీ స్థానాల నోటిఫికేషన్ విడుదుల
posted on: Mar 10, 2015 5:09PM

కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కోటాలో ఉన్న ఐదు ఎమ్మెల్యేల స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనమండలి సభ్యులుగా ఉన్న రుద్రరాజు, పద్మరాజు, సింగం బసవపున్నయ్య, తిప్పేస్వామి, నన్నపునేని రాజకుమారి పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుండడంతో ఆస్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే వీటితో పాటు ఖాళీగా ఉన్న మరో స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. మార్చి 17 నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణక చివరితేది మార్చి 20. 5 స్థానాలకు 18 నామినేషన్లు పరిశీలనలో ఉంటాయి. మార్చి 27వ తేదీ పోలింగ్ నిర్వహించి అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.






