Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
posted on: May 14, 2015 1:19PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో శాసనమండలిలో పెరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలు, పాలడుగు వెంకట్రావు మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంతో మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21వ తేదీ నుండి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మే 25 వరకు గడువు ఉంటుంది. అయితే ఎన్నికలు జూ 1వ తేదీన నిర్వహిస్తామని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని, అదేరోజు ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.






