జగన్ మళ్లీ సీఎం కాకపోతే జరిగేదిదే! మంత్రి హాట్ కామెంట్స్..  

posted on: Jan 4, 2022 3:33PM

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం సగం కాలం పూర్తి చేసుకుంది. అంటే జగన్ రెడ్డి పాలనకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది. అయినా ఏపీలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల మాట వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాయనే యోచనలో జగన్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం ఉండగానే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వస్తాయని కామెంట్స్ చేయడం మరింత కాక రాజేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, అధికారం తమదేనని కూడా చంద్రబాబు చెప్పారు.

ముందస్తు ఎన్నికలు, చంద్రబాబు సవాల్ కు వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరైతే మరింతగా ముందుకెళ్ళి జోస్యాలు కూడా వదులుతున్నారు. జగనే మళ్లీ సీఎం అవుతారని ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి ఢోకా లేదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమన్నారు.  ఈ విషయంలో మాకు ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వీర లెవెల్ లో శపధం చేశారు ధర్మాన కృష్ణదాస్. 

జగన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే అంతకంటే పొరపాటు మరోటి లేదని కూడా ధర్మాన అన్నారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారని గుర్తుచుకోవాలని ఆయన విపక్షాలను హెచ్చరించారు. రాష్ట్రానికి జగన్ అవసరం చాలా ఉందని కూడా ధర్మాన అంటున్నారు.  ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ విషయంలో జగన్ తాను చేయాల్సింది చేస్తున్నారని కూడా చెప్పారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...