ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2 వాసుదేవ రెడ్డి అరెస్ట్

posted on: Feb 21, 2026 6:33PM

 

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న వాసుదేవ రెడ్డిని సిట్ అధికారెలు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు. గతంలో వాసుదేవ రెడ్డి దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన కొన్ని లిక్కర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. 

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. సిండికేట్లకు మేలు చేస్తూ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టేందుకు వాసుదేవరెడ్డి 'అప్రూవర్' మారే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన అప్రూవర్‌గా మారితే.. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...