TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూపాయి కూడా ఇచ్చేది లేదు

Published on: Sat Apr 11, 2015 1:08PM

 

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్ల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఖరాకండిగా చెప్పారు. ఎన్ని కేసులు పెట్టి, జైలుకు పంపించిన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్లలో కొంచెం కూడా మార్పు రావడం లేదని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. అనవసరంగా తమిళనాడు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు దీనిని రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఓ పక్క శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్లను ఎన్‌కౌంటర్‌ విషయంలో తమిళనాడు ప్రభుత్వం అనేక ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.