TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ఉన్నత విద్యామండలికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

Published on: Thu May 14, 2015 10:24AM

 

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి హైదరాబాద్ లో ఉనికిని కోల్పోయిందని, తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిని హైదరాబాద్ లోనే కొనసాగించుకోవచ్చని, తమ రాష్ట్రంలో తామే పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పు నిచ్చింది. తదుపరి విచారణను నాలుగు రోజుల పాటు వాయిదా వేసింది.