దినేష్‌రెడ్ది పదవి పై తీర్పు వాయిదా
posted on: Sep 29, 2013 5:57PM

డీజీపీ దినేష్‌రెడ్ది పదవి కాలాన్ని పొడిగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. తీర్పు ఆదివారం సాయంత్రం గానీ, లేదా సోమవారం ఉదయం గానీ వెల్లడిస్తామని జస్టిస్ అశుతోష్ మొహంతా, జస్టిస్ శేషాద్రి నాయుడు బెంచ్ పేర్కొంది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ దినేష్‌రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిసన్‌ను వేసిన విషయం తెలిసిందే. ఆదివారం జస్టిస్ అశుతోష్ నివాసంలో హౌస్ మోషన్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ మేరకు వాయిదా వేశారు



.jpg)
.jpg)


