Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇది ఒక్క ఉపాధ్యాయుని వేదన కాదు... ఇది లక్షల మంది అధ్యాపకుల ఆవేదన
posted on: Aug 8, 2025 6:25PM

టెక్నాలజీ లేని రోజుల్లో టీచర్లు పాఠాలు మాత్రమే చెప్పారు. నేడు టెక్నాలజీ పేరుతో విద్యార్థులకు విద్య రాకుండా చేయడానికే అనిపిస్తోంది. టెక్నాలజీ లేని రోజుల్లో టీచర్లు పాఠాలు విని పిల్లలు గొప్పవాళ్లు అయ్యారు. బిల్డింగ్స్ లేని కాలంలో... బోర్డు లేని రోజుల్లో.. మధ్యాహ్న భోజనం లేని రోజుల్లోనూ, బ్యాగ్, బాక్స్, డ్రెస్, షూస్ మరియు టాయిలెట్స్ లేనప్పుడు కూడా టీచర్లు పాఠాలు చెప్పారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. వయోజనులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.
ఒక టీచర్ అయిదు తరగతులకు పాఠాలు చెప్పిన రోజుల్లో పిల్లలు IAS, IPS, IFS, IRS, ISS...మొదలైన దేశంలో యూపీఎస్సీ సర్వీసులకు మరియు రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ ఎంపికయ్యారు. డాక్టర్లగా, ఇంజనీర్లుగా, అడిటర్లగా, లాయర్‌గా పై వసతులు లేనప్పుడు తయారు చేశారు. నేడు సకల సౌకర్యాలు ఉన్నప్పటీకి చదువు కనిపించడం లేదు. నాడు విద్య ఉచితం..నేడు విద్యా ఖరీదు. ఇప్పటి విద్యా దుస్థితి చూస్తే గుండె చలించిపోతుంది.
పాఠశాల్లో ఉపాధ్యాయులు పాఠలు చెప్పటం కన్నా ఫోటోలు తీయటం ముఖ్యం ఉపాధ్యాయులు, అధ్యపకులు పాఠశాలు చెప్పటం వదిలిసి Track & Upload లో మునిగిపోయాడు. Online Attendance, Task Tracker, Assessment Reports, PMR, WhatsApp Updates...కాని
పాఠశాల ఏకంగా డాక్యుమెంటేషన్ కేంద్రంగా మారిపోయింది!
ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పటం కన్నా ఫారాలు నింపే పని ఎక్కువయింది.
పుస్తకల్లో ఉన్నా అధ్యయనల కన్నా యాప్ స్క్రీన్షాట్ ఎక్కువైంది
విద్యార్థుల విద్యా అభివృద్ధి కన్నా సెల్ఫీ అప్‌లోడ్ ఎక్కువ అయింది.
ఇలాంటి పరిస్థితులు ఉంటే… ఎవరూ మాట్లాడటం లేదు
కానీ వేలాది ఉపాధ్యాయులు ఊపిరాడక అల్లాడిపోతున్నారు!
పాఠం చెప్పే అవకాశం లేకపోవడం…
విద్యార్థి స్థాయిని బట్టి బోధించే స్వేచ్ఛ లేకపోవడం
చదువు బాగా రావాలన్న టీచర్ ఆశయాన్ని వమ్ము చేయడం
ప్రభుత్వ పెద్దలకు ఎంత వరకు శ్రేయస్కరం కాదు
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆంగ్ల మాధ్యమం లేని రోజుల్లో కూడా
టీచర్లు విద్యార్థికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారు
ఆ విద్యార్థులే కలెక్టర్లు అయ్యారు,
దేశ విదేశాల్లో బహుల జాతి కంపెనీలకు CEOలు అయ్యారు,
సైన్యంలో సైనికులు అయ్యారు.
దేశాన్ని నడిపించే నాయకులు అయ్యారు.
సెంటిస్టులు అయ్యారు.
విదేశీ రాయభారులు అయ్యారు.
ఈరోజు టీచర్ పరిస్థితి ఏమిటంటే?
విద్యార్థికి విద్యా బుద్దులు చెప్పటం కన్నా
సెల్‌ఫోన్ స్క్రీన్ ముఖ్యమైపోయింది!
పాఠం చెప్పే కంటే... రిపోర్టు అప్‌లోడ్ ముఖ్యమైనంది
విద్యార్థి నలుగురిలో మేధావిగా తయారవ్వాలన్న ఆశయాన్ని
మార్గదర్శకాలు మింగేస్తున్నాయి!
బోధన విషయంలో ఓనమాలు రాని వారు..
ఇప్పుడు "ఇలా చెప్పాలి, అలా చదివించాలి" అని ఆదేశిస్తున్నారు.
పాఠశాలలో పాటలు కూడా చెప్పని వారు...
టీచర్లకు బోధన విధానం చెబుతున్నారు!
ఈ దుస్థతి పరిస్థతి ఆశ్చర్యకరం.
సాంకేతికత విజ్ఞానం అనేది ఉపకరణం కావాలి… విద్యపై భారం కాకూడదు!
టీచర్‌కు తన పాఠాన్ని నేర్పే స్వేచ్ఛ, సమయం, గౌరవం ఇవ్వాలి…
అదే అసలైన విద్యా సంస్కరణ!
1 నుండి 10వ తరగతి విద్యార్థికి అవసరమైన నైపుణ్యాలను బోధించే అవకాశం ఇవ్వండి!
చదవడం – రాయడం – ఆలోచించడం – గణిత అవగాహన బలపరిచే స్వేచ్ఛ ఇవ్వండి!
పిల్లల స్థాయి, గ్రామీణ నేపథ్యం, బోధన భాష... అన్నీ పరిగణనలోకి తీసుకుని విధానం రూపొందించండి!
ఈ దేశంలో నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, విదేశీ CEOలు, వైమానిక వీరులు... అందరూ పాఠశాలలో టీచర్ చెప్పిన పాఠం వల్లే ఎదిగారు – ఇది ఓ నగ్న సత్యం! ఈరోజు టీచర్‌కు పాఠం చెప్పే సమయం దొరకకపోతే... నేటి బాలలే రేపటి పౌరులు. సరియైన విద్య అందించకపోతే రేపటి పౌరుల దేశ భవిష్యత్తు ఎక్కడుందో ఊహించుకోండి.
గురువులను గౌరవించండి గురు బోధలను స్వీకరించండి… గురువులకు మాట్లాడే అవకాశం కల్పించండి. గురువుల స్వరం దేశ భవిష్యత్తు అభ్యున్నతికి
విద్యార్థి జీవితాన్ని మార్చే ఓ గొప్ప వాక్యం... పుస్తకంలో కాదు...
గురువు బోధించే జ్ఞానంతో పాటు విజ్ఞానం లభిస్తుంది. గురువు లేని చదువు వృధా.






