TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Published on: Mon Aug 4, 2025 4:44PM

 

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సచివాలయ ఉద్యోగులు, శాఖాధిపతులకు వర్తించనుందని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు అమరావతికి వచ్చారు.

వారికి కొంత హెచ్‌ఆర్‌ఏ పెంచి ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. అమరావతి పరిధిలో నివసించే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. ఆ వసతి సౌకర్యాన్ని మరో ఏడాది తాజాగా పొడిగించింది. ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్‌లో ఉండడం.. ఉద్యోగులు మాత్రమే అమరావతిలో ఉంటుండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.