Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ ప్రభుత్వ రికార్డుల ధ్వంసం జరుగుతోంది
posted on: May 16, 2024 5:00PM
ఆమధ్య తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన రోజున, ఆ ప్రభుత్వం చేయించిన ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్లులు, ఆధారాలు ధ్వంసం చేయడం జరిగింది కదా.. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘ధ్వంసం’ కార్యక్రమం ‘ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్’ రూపంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-ఆఫీస్’ని మూసేశారు. మే 17 నుంచి 25 వరకు ‘అప్‌గ్రేడ్’ చేసే నెపంతో ఈ-ఆఫీస్‌ని మూశారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి చంద్రబాబు లేఖ రాశారు. త్వరలో కొత్త ప్రభుత్వం వస్తున్నందున, ఆ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని కొత్త ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ ప్రభుత్వమే అప్‌గ్రేడ్ చేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం వుందని చంద్రబాబు ఆ లేఖలో రాశారు. ఇలా ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.






