డిప్యూటీ సీఎం పవన్‌పై విచారణ వాయిదా
posted on Sep 8, 2025 3:26PM
.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈనెల 15కు వాయిదా పడింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ సినిమా షూటింగ్‌లో పాల్గొనడంపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.