TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడప కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

Published on: Mon Jun 9, 2025 7:29PM

 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు .ఐ ఎం ఎం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ కార్యకర్తల తో ఏఐసీసీ సభ్యులు సుంకర పద్మశ్రీ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. షర్మిల జిందాబాద్ పద్మశ్రీ డౌన్ డౌన్ టు నినాదాలు చేశారు. కడప జిల్లా పర్యటనలో షర్మిలపై సుంకర పద్మశ్రీ ఆరోపణలు చేశారు .

సుంకర పద్మశ్రీ ఏర్పాటు చేసిన సమావేశంలో షర్మిల వర్గం ఆమెను ప్రశ్నించడం జరిగింది. దీంతో రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పడ్డారు. సుంకర పద్మశ్రీ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీరాములు, నజీర్ అహ్మద్ పాల్గొనగా షర్మిలకు మద్దతుగా జిల్లా డిసిసి అధ్యక్షురాలు విజయ జ్యోతి, పులివెందుల, పొద్దుటూరు, నియోజకవర్గాల అధ్యక్షులు ధ్రువ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ భాషాలు పాల్గొన్నారు