Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సెక్రటేరియట్ కు రాని జగన్.. ఆ టెన్షన్ తట్టుకోలేకే!!
posted on: Jul 9, 2019 6:19PM

గత మే 30న అధికారం చేపట్టిన జగన్ పక్క రాష్ట్ర సీఎం కెసిఆర్ లా కాక నిత్యం సెక్రటేరియట్ కు వెళుతూ తన అధికారిక కార్యక్రమాలను అక్కడినుండి చక్కపెడుతూ వస్తున్నారు. అయితే అయన ఈ మధ్య సచివాలయానికి వెళ్ళడం తగ్గించేశారు. దీనికి ముఖ్య కారణం ఏమిటో అని కూపీ లాగగా తెలిసిన విషయం ఏమిటంటే.. తాజాగా ఉద్యోగుల, అధికారుల సాధారణ బదిలీలపై నిషేదాన్ని జగన్ఎ త్తివేశారు. దీనితో తమ బదిలీల కోసం అనేక మంది ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అధికారులను, నేతల్ని కలవడానికి నిత్యం తండోప తండాలుగా వస్తున్నారు. కొందరైతే తమకు కావాల్సిన చోటికి బదిలీల కోసం వైసిపి నాయకులను, లేదా ద్వితీయ శ్రేణుల్ని ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి పని జరిపించుకోవాలని చూస్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం బదిలీల్లో ఎలాంటి లాబీయింగ్ లేకుండా అన్నీ పారదర్శకంగా జరగాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు, ఉద్యోగులు నేతల్ని వెంటబెట్టుకుని సచివాలయానికి తరలివస్తుండటంతో.. వైసిపి నేతలు కూడా సిఎం ను కలవడం కోసం సెక్రటేరియట్ లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జగన్ వారిని తప్పించుకోలేక బదిలీల ప్రక్రియ ముగిసే వరకు సెక్రటేరియట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తన ఇంటి పక్కనే ఉన్న క్యాంప్ కార్యాలయం నుండే అన్ని పనులు చూసుకుంటున్నారాని తెలుస్తోంది.






