రేపు తిరుపతిలో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న చంద్రబాబు
Published on: Tue Jun 30, 2015 6:42AM
.jpg)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొన్నప్పుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరంలోనే ఉన్నప్పటికీ ప్రోటో కాల్ ఇబ్బందుల వలన ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు. కనుక ఈరోజు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి వస్తారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం గవర్నర్ ఇచ్చే విందులో మరొకసారి ఆయనను కలుస్తారు. రేపు జూలై 1వ తేదీన రాష్ట్రపతి తిరుపతికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు


