TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూడు విద్యాసంస్థలకు శంకుస్థాపన

Published on: Sat Mar 28, 2015 4:45PM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే రోజు ఒకే చోట మూడు విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశారు. చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మెర్లపాకలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ సంస్థల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, మంత్రులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఒకే రోజు, ఒకే జిల్లాలో మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు శంకుస్థాపన చేయడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, ఇదే మొదటిసారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే బడ్జెట్ లో ఎక్కువ నిధులు విద్యకే కేటాయించినట్లు తెలిపారు.