జేసీ దివాకర్‌రెడ్డికి షాక్.. టిక్కెట్ ఇవ్వనన్న చంద్రబాబు

posted on: Dec 1, 2018 11:41AM

 

ఏపీలో రాబోయే ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్టింగ్ ల పనితీరుపై సర్వేలు చేయించి వారి పని తీరు బాగుంటునే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై చర్చిస్తూ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం చంద్రబాబు అనంతపురం జిల్లా వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ సమయంలో వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారట. ఈ కసరత్తులో భాగంగానే తాను ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ మార్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నానని, అందులో మంచి ఫలితాలు వచ్చిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని స్పష్టంచేశారట. ఈ తరుణంలో జేసీ దివాకర్‌రెడ్డి కల్పించుకుని 'నా మీద సర్వే నిర్వహించినప్పుడు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే టిక్కెట్ ఇవ్వరా?' అని ప్రశ్నించారట. దీనిపై స్పందించిన చంద్రబాబు 'టిక్కెట్‌ ఇవ్వను' అని చెప్పేశారట. బాబు ఇచ్చిన సమాధానంతో జేసీ దివాకర్‌రెడ్డి షాక్‌కు గురయ్యారట. దీనిబట్టి చూస్తుంటే టిక్కెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు భారీ కసరత్తులే చేస్తున్నట్టు అనిపిస్తోంది. చూద్దాం మరి ఆ టైం కి చంద్రబాబు నాయకులకు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో.

google-ad-img
    Related Sigment News
    • Loading...