TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నూతన రాజధాని నిర్మాణానికి 3168 కోట్లు

Published on: Thu Mar 12, 2015 1:56PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 2015-16 బడ్జెట్‌లో 3168 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. నూతన రాజధానిని 33,252 ఎకరాల్లో రైతులను ఒప్పించి నిర్మిస్తున్నామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 87 శాతం భూసమీకరణ పూర్తి చేశామని తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సీఆర్‌డీఏకు నిధులు విడుదల చేస్తామని యనమల ప్రకటించారు. మెరైన్‌ అకాడమీకి మచిలీపట్నం వద్ద 300 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు యనమల వివరించారు.