Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజధాని అమరావతి శంకుస్థాపన ముహూర్తం ఖరారు
posted on: Oct 3, 2015 11:17AM
.jpg)
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత అంగరంగా వైభవంగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెయ్యిమందికి పైగా అతిధులను ఆహ్వానించనున్నారు. అయితే ఈ నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముహుర్తం ఖరారు అయింది. దసరా రోజు అంటే అక్టోబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మందడం- ఉద్దండరాయపాలెం మధ్యలో భూమిపూజ జరిగిన చోటునే శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. గురువారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు శంకుస్థాపనం కార్యక్రమంపైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


.jpg)



