పవన్ వస్తాడా? రాడా?
posted on Sep 21, 2015 10:28AM

ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎవ్వరూ మర్చిపోలేని విధంగా సుమారు వందల కోట్ల రూపాయిల ఖర్చుతో నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమానికి ప్రధానితో నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖ రాజకీయ వేత్తలను కూడా ఆహ్వానించనున్నారు. అయితే అంతా బానే ఉన్నా ఈశంకుస్థాపన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారా? లేదా?అన్నది అందరి సందేహం. బీజేపీ.. టీడీపీ పార్టీలకు మిత్రపక్షంగా ఉండి ఎన్నికల సమయంలో వారి పార్టీల తరుపున ప్రచారం చేసి.. వాళ్లు గెలవడానికి ఒకింత కారణమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆపార్టీ అధికారంలోకి వచ్చి తలపెడుతున్న మహత్తరమైన కార్యక్రమానికి వస్తారా? లేదా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే సహజంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడం చాలా తక్కువ ఈ నేపథ్యంలోనే పవన్ ఈకార్యక్రమానికి హాజరుకాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాను ప్రచారం చేసిన పార్టీ చేసే కార్యక్రమానికి పవన్ తప్పకుండా హాజరవుతారనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఏపీ శంకుస్థాపన కార్యక్రమేమో కాని ఇప్పుడు పవన్ రాకపై అందరికి ఆసక్తి పెరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అన్నది తను చెప్పేంతవరకూ ఈ విషయంలో క్లారిటీ రాదు.