రాజధాని రైతులతో సీఆర్ డీఏ అధికారులు..
Published on: Thu Nov 12, 2015 5:27PM
.jpg)
ఏపీ రాజధాని రైతులతో సీఆర్ డీఏ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ అధికారులు రైతులుకు మాస్టర్ ప్లాన్ ను వివరిస్తున్నారు. అంతేకాదు రైతులు నుండి సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు..దీనిలో భాగంగానే మాస్టర్ ప్లాన్ లో రైతులు కొన్ని మార్పులు కూడా సూచించారు. మొత్తం 29 గ్రామాల్లో 9 సిటీలు నిర్మాణం.. ఏయే గ్రామాల్లో ఏయే సిటీలు నిర్మించాలి అనే దానిపై సీఆర్ డీఏ కమిషనర్ మంత్రి నారాయణ రైతులకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్ని పరిశీలించిన తరువాతే మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు.


