Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రూ.1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
posted on: Mar 18, 2013 1:53PM

శాసనసభలో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి రూ.1,61,348 కోట్లతో సోమవారం ఉదయం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అగ్రాసనం వేస్తుందన్నారు. వ్యవసాయం రంగంలో ఆరు శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. ఉగాది నుంచి పేదలకు రేషన్ కార్డు ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, దాని కోసం రూ.660 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో మెరుగైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
బడ్జెట్‌లోని అంశాలు :
- హోంశాఖ - రూ.5,386 కోట్లు
- ఐటీ - రూ.207 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం - రూ.1,120 కోట్లు
- సాగునీరు - రూ.13,800 కోట్లు
- ఇంధనం - రూ.7,117 కోట్లు
- మౌలిక సదుపాయాల కల్పనకు - రూ. 180 కోట్లు
- పర్యావరణం, అడవులు, శాస్త్రసాంకేతిక రంగానికి - రూ.551 కోట్లు
- పాఠశాల విద్య - రూ.16990 కోట్లు
- ఉన్నత విద్య - రూ.4082 కోట్లు
- వైద్య, ఆరోగ్య శాఖ - రూ.1,738 కోట్లు
- కార్మిక శాఖ - రూ.562 కోట్లు
- పట్టణాభివృది - రూ.6770 కోట్లు
- ఎన్ఆర్ఈజీఎస్ - రూ.11200 కోట్లు
- పౌరసరఫరా - రూ.3231 కోట్లు
- గృహనిర్మాణం - రూ. 2326 కోట్లు
- సాంస్కృతిక రంగం - రూ.69 కోట్లు
- పర్యాటక రంగం - రూ. 163 కోట్లు
- యువజన సేవలకు - రూ.280 కోట్లు
- వికలాంగులకు - రూ.73 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి - రూ.1027 కోట్లు
- బీసీ సంక్షేమానికి - రూ.4027 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి - రూ.4,122 కోట్లు
- గిరిజన సంక్షేమానికి - రూ.2,126 కోట్లు
- వ్యవసాయానికి - రూ.6,28 కోట్లు
- మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,980 కోట్లు
- కృష్ణా జలాల తరలింపునకు రూ.1,676 కోట్లు
- కొత్తగా 18 రెవెన్యూన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు
- 2 కలెక్టరేట్‌లు, 144 తహశీల్దార్ భవనాలు నిర్మిస్తాం
- రెవెన్యూ అధికారుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు
- ఈ ఏడాది 27,903 కొత్త ఉద్యోగాలు
- తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రికి 100 పడకల పెంపు
- నెల్లూరులో 150 పడకలతో ఆస్పత్రి
- వికలాంగులకు వివాహం చేసుకుంటు 50 వేలతో ప్రోత్సాహం
- 2291 సబ్ఇన్‌స్పెక్టర్లు, 736 కానిస్టేబుళ్ల నియామానికి త్వరలో నోటిఫికేషన్
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ల నిర్మాణం
- వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.262 కోట్లు
- తిరుపతి, జహీరాబాద్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్
- రాజీవ్ యువ కిరణాలు ద్వారా 2014-15 నాటికి 15 లక్షల మందికి ఉపాధి
- గ్రామీణ, నగర ప్రాంతాల్లో అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం.






